కుర్రకారును ఆకర్షిస్తున్న ప్రగతి

by Shyam |   ( Updated:2020-07-22 07:40:27.0  )
కుర్రకారును ఆకర్షిస్తున్న ప్రగతి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగింటి అందానికి ప్రతిరూపం ఆమె. నిండైన కట్టుబొట్టుతో.. చూడగానే ఆకర్షించే అందం ఆమె సొంతం. లేటు వయస్పులోనూ టాప్ హీరోయిన్ల అందంతో పోటీపడి మరి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్న నటి ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేకవైన స్థానాన్ని సంపాధించుకున్న ప్రగతి.. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో తల్లి, అత్త పాత్రలను పోషిస్తూ కుర్ర హీరోయిన్లతో పోటీపడుతారు.

సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే ప్రగతి.. కరోనా టైంను వృథా చేయకుండా సద్వినియోగం చేసుకుంటోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు తన బాడీ ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు వర్కౌట్లతోపాటు డ్యాన్సులు చేస్తుంది. తాజాగా ఆమె వర్కౌట్ల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతున్నాయి. నాలుగు పదుల వయస్సు దాటినా నాజుకుగా కనిపిస్తున్న ఆమె వీడియోలను చూసి నెటిజర్లు తెగ పొగిడేస్తున్నారు.

https://twitter.com/anu_for_ever/status/1285820154404728832?s=09

Advertisement

Next Story