‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ రివీల్ చేయనున్న ప్రభాస్

by Shyam |
‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ రివీల్ చేయనున్న ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ రివీల్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’ తెలుగులో ఫస్ట్ జాంబీ మూవీ కాగా.. తేజ సజ్జ, ఆనంది, దక్ష లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా.. జనవరి 2న ట్రైలర్ విడుదల చేయనున్నారు ప్రభాస్. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్న సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తికాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తేజ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్‌గా కనిపిస్తుండగా.. ఆనంది ఆధ్యాత్మికంగా, దక్ష పబ్జీ గేమర్‌గా నటిస్తోంది.

Advertisement

Next Story