ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘రాధే శ్యామ్’ నుంచి మరో బిగ్ అప్ డేట్ 

by Shyam |   ( Updated:2023-12-14 14:47:01.0  )
radey shyam
X

దిశ, సినిమా: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డేల పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ మూవీ హిందీ వెర్షన్ నుంచి ఇప్పటికే ‘ఆషికీ ఆ గయీ’ అంటూ సాగే లవబుల్ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

కాగా తాజాగా మేకర్స్ సాడ్ సాంగ్ ‘సోచ్ లియా’ టీజర్ విడుదల చేశారు. ప్రేరణ, విక్రమాదిత్యల మధ్య దూరంతో విరహవేదన అనుభవిస్తున్నట్లు కనిపిస్తున్న ఈ సాంగ్ డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. కాగా పాటను బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ అర్జిత్ సింగ్ పాడగా.. మిథున్ స్వరాలు, మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు. ఈ ఎపిక్ లవ్ స్టోరీని రాధా కృష్ణ కుమార్ తెరకెక్కి స్తుండగా.. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Advertisement

Next Story

Most Viewed