- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలీవుడ్ ప్రొడక్షన్‌లో ప్రభాస్
బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్.. ఆ తర్వాత వచ్చిన ‘సాహో’తో అంచనాలను అందుకోలేక పోయాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమా చేస్తున్న ప్రభాస్.. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో మరో సినిమా కమిటైన విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇవి రెండు కూడా పాన్ ఇండియా చిత్రాలు కాగా, ప్రభాస్ తర్వాతి సినిమా కూడా నేషనల్ లెవల్‌లో ఉంటుందని సమాచారం.
ప్రభాస్ పాపులారిటీ, యాక్టింగ్‌కు ఫిదా అయిన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తనతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీవర్గాల టాక్. ఈ విషయమై ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్.. ఇప్పటికే ప్రభాస్‌ను సంప్రదించగా, దర్శకుడు ఓం రావుత్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని టాక్.
కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓ డియర్’ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. సాధారణ పరిస్థితులు నెలకొనగానే ట్రైలర్ రిలీజ్ చేసి, సినిమాను థియేటర్లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.