అమ్ములు బర్త్‎డేకు ప్రభాస్ గిఫ్ట్..!

దిశ, నారయణఖేడ్: అమ్ములు అనే చిన్నారికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి మరోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు బాహుబలి. అమ్ములు ఎవరు..? ఎందుకు గిఫ్ట్ అనుకుంటున్నారా ..?

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బెల్లాపూర్‎కు చెందిన నర్సింహారెడ్డి మనుమరాలు అమ్ములు. నర్సింహారెడ్డి అల్లుడు అయిన లక్ష్మణ్ రెడ్డి.. హిరో ప్రభాస్‎కు వ్యక్తిగత జిమ్ కోచ్‎గా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ కండల వీరుడిగా చూపడంలో లక్ష్మణ్ రెడ్డి ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఈ క్రమంలో లక్ష్మణ్ రెడ్డి చిన్న కూతురు అమ్ములు జన్మ దినం సందర్భంగా ప్రభాస్ రేంజ్ రోవర్ కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చి అబ్బురపరిచాడు. హీరో కార్ గిఫ్ట్‎గా ఇవ్వడం పట్ల అమ్ములు తాత నర్సింహారెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Advertisement