అడవిని దత్తత తీసుకున్న బాహుబలి

దిశ, వెబ్‌డెస్క్: బాహుబలి ప్రభాస్ శ్రీమంతుడు అనిపించుకున్నాడు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, ఖాజీపల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన ప్రభాస్.. అర్బన్ బ్లాక్ అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో మొక్కలు నాటి అటవీ సంపదను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్‌తో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

https://www.instagram.com/p/CE1leGxHUA1/?utm_source=ig_web_copy_link

1650 ఎకరాల్లో ప్రభాస్ మొక్కలు నాటేందుకు సంకల్పించగా.. అర్బన్ ఎకో పార్క్‌‌కు ప్రభాస్ తండ్రి U.V.S. రాజు పేరిట నామకరణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభాస్ ఇప్పటికే రూ. 2 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ సంతోష్.. ప్రభాస్‌ను అభినందించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం.. మరింత మంది స్టార్స్ కూడా అడవుల అభివృద్ధికి ముందుకు వచ్చేలా చేస్తుందని అన్నారు.

కాగా, డార్లింగ్ నిర్ణయానికి ప్రశంసలు అందుతుండగా.. మా ప్రభాస్‌ది గోల్డెన్ హార్ట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

https://www.instagram.com/p/CE1leGxHUA1/?utm_source=ig_web_copy_link

Advertisement