త్వరలో 'ఓ డియర్' ఫస్ట్ లుక్

by Shyam |
త్వరలో ఓ డియర్ ఫస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం చూపిస్తున్నా హీరో ప్రభాస్ ‘ఓ డియర్’ మూవీ టీం మాత్రం వెనక్కి తగ్గలేదు. జార్జియాలో పది డిగ్రీల చల్లని ఉష్ణోగ్రత, వర్షంలోనూ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దర్శకులు రాధాకృష్ణ. ప్రభాస్ 20వ చిత్రంకు చెందిన మరో షెడ్యూల్ పూర్తయిందని తెలిపారు. ఇంత త్వరగా, సక్సెస్‌ఫుల్‌గా షెడ్యూల్ పూర్తి చేసేందుకు సహకరించిన జార్జియా టీంకు థాంక్స్ చెప్పారు. త్వరలోనే ‘ఓ డియర్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. త్వరగా డేట్, టైమ్ ఫిక్స్ చేయండని కోరుతున్నారు. మేము ఐతే ఉగాదికి అని ఫిక్స్ అయిపోయామని.. ఎలాంటి తేడాలు రావనే అనుకుంటున్నామని చెబుతున్నారు.

tags : O Dear, Prabhas, Bahubali Prabhas, Georgia, Radha Krishna



Next Story

Most Viewed