7000 సంవత్సరాల క్రితం తెలివైన రాక్షసుడు!

by Anukaran |
7000 సంవత్సరాల క్రితం తెలివైన రాక్షసుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’తో అభిమానులను అలరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా చిత్ర యూనిట్ కూడా ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తోంది. అందుకే కథానాయకుడితో పాటు ప్రతి నాయకుడి పాత్ర పై ప్రత్యేక శద్ధ పెట్టారు.

రామాయణం కథ ఆధారంగా తీస్తున్న ఆదిపురుష్‌ సినిమాలో రావణాసురిడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ కనిపించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. విడుదల చేసిన గంటల వ్యవధిలోనే ట్విట్టర్‌లో ఈ పోస్టర్ ట్రెండ్ అవడం గమనార్హం. తానాజీ సినిమాలో విలన్‌గా అలరించిన సైఫ్ అలీఖాన్‌ను డైరెక్టర్ ఓం రౌత్.. ఆదిపురుష్‌ మూవీలో లంకేష్ క్యారెక్టర్‌ను ఎలా చూపించబోతున్నారన్న అంశం సినిమా అంచనాలను మరింత పెంచింది. అయితే, ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన యంగ్ రెబల్ స్టార్.. ‘7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉన్నాడు!’ అంటూ పోస్టు చేశాడు.

Advertisement

Next Story