- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చైనా దిగుమతులపై జాగ్రత్త’
దిశ, సెంట్రల్ డెస్క్: చైనా నుంచి దిగుమతి అవుతున్న విద్యుత్ పరికరాలతో అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రధానంగా విద్యుత్ కంపెనీలు వాడుతున్న వాటిలో మాల్వేర్, ట్రోజన్ హార్స్‌ను ఉంచి చైనా దేశం విక్రయించే ప్రమాదముందని, ఇవి గనక భారత విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానమైతే సంక్షోభ సమయంలో చైనా అవి కుప్పకూలేలా చేయొచ్చని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి ఆర్‌కే సింగ్ చెప్పడం గమనార్హం. ఇప్పటికే చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని, దేశీయ తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే చైనా వస్తువులపై అధిక సుంకాలను విధిస్తూనే, నాణ్యతా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇందులో అధికంగా సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో వినియోగిస్తున్న పరికరాలపై ఛార్జీలు విధిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
ఈ క్రమంలోనే ఆర్‌కే సింగ్ ఇంటర్వ్యూలో పైవిధంగా స్పందించారు. విద్యుత్ రంగం వ్యూహాత్మకమైంది. దేశంలో ఉన్న కంపెనీలు, పరిశ్రమలు, సమాచారం దీనిపైనే ఆధారపడి ఉంటాయని, శత్రుదేశం ఎలాగైనా భారత్‌ను దెబ్బతీసే అవకాశాన్ని ఇవ్వకూడదని, దీన్ని నిలువరించేందుకు ఫైర్‌వాల్ చేపట్టనున్నట్టు ఆర్‌కే సింగ్ వివరించారు. అధిక సుంకం, విదేశీ పరికరాలపై కఠినమైన పరీక్ష, దిగుమతులకు ముందస్తు అనుమతులు విద్యుత్ రంగానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. అలాగే, సైబర్ ముప్పును కనిపెట్టేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్‌కే సింగ్ వెల్లడించారు.
మాల్వేర్, ట్రోజన్ హార్స్ ద్వారా విద్యుత్ సరఫరాను నిలిపేసే సమాచారం తమ వద్ద ఉందని అందుకే ఈ సున్నితమైన రంగమని ఆయన చెప్పారు. డిఫెన్స్ సహా అన్ని పరిశ్రమలు వీటి ఆధారంగాన్ పని చేస్తున్నాయని, అనుకోకుండా విద్యుత్ అంతరాయం ఏర్పడితే మన వద్ద కేవలమ ఒక రోజుకు సరిపడా నిల్వ ఉందన్నారు. అంతేకాకుండా, ఆగస్టు నెల నుంచి సోలార్ మాడ్యూల్స్‌పై 25 శాతం కస్టమ్స్ ట్యాక్స్‌ను విధించనున్నట్టు ఆర్‌కే సింగ్ పేర్కొన్నారు. దీన్ని 2022, ఏప్రిల్ నాటికి 40 శాతానికి పెంచే ఆలోచన ఉన్నట్టు ఆయనన్నారు. ప్రస్తుతం వీటిపై 15 శాతం సుంకం ఉంది. దీని గడువు జూలై చివరి వరకు ఉంది. అందుకే, ఆగష్టు నుంచి 25 శాతానికి పెంచుతున్నట్టు వివరించారు. కాగా, మన దేశంలో దిగుమతి అయ్యే సోలార్ మాడ్యూల్స్‌లో 80 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి.