ఆ జిల్లాలో సా. 6 నుంచి 10 గంటల వరకు పవర్ కట్

by srinivas |
Power1
X

దిశ, ఏపీ బ్యూరో: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతున్న సంగతి తెలిసిందే. ఇక బొగ్గు ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటంతో అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు అధికారులు. తాజాగా శ్రీకాకుళంలో విద్యుత్ సంక్షోభంలో భాగంగా మంగళవారం నుంచి జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే వీటి నుంచి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు ఇచ్చినట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో అనధికారికంగా గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed