కరోనాను తరిమేద్దాం : ఎమ్మెల్యే సీతక్క

by Shyam |
కరోనాను తరిమేద్దాం : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, వరంగల్: ఏప్రిల్ 14 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ప్రజలెవరూ బయటికి రాకుండా కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. గురువారం తాడ్వాయి మండలంలోని లింగాల, బోటిగూడెం, కొడిశాల, ఒడ్డుగూడెం, గంగారం మండలంలోని మామిడిగూడెం, దుబ్బగూడెం, గోవిందరావుపేట మండలం‌లోని మొద్దులగూడెంలోని నిరుపేద కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు మందులు లేవు నివారణ ఒకటే మార్గమని అన్నారు. ప్రతిఒక్కరూ స్వీయ నిర్బంధాన్ని పాటించి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్క్ ధరించాలని అలాగే బయటికి వెళ్ళి‌ వచ్చాక శానిటైజర్, సబ్బులతో చేతులు, కాళ్ళు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

tags: Poor families, provide, essential, items, MLA Seethakka, mulugu, wgl

Advertisement

Next Story