ఆచార్య సెట్స్‌లో బుట్టబొమ్మ

by Jakkula Samataha |   ( Updated:2021-02-10 08:20:04.0  )
ఆచార్య సెట్స్‌లో బుట్టబొమ్మ
X

దిశ, సినిమా : బుట్టబొమ్మ పూజా హెగ్డే.. మరోసారి మెగా కాంపౌండ్‌లో ఎంటర్ కాబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ, వరుణ్ సందేశ్‌తో జతకట్టిన భామ.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో చెర్రీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పూజ ఈ వారంలోనే ‘ఆచార్య’ సెట్స్‌లో జాయిన్ కాబోతుందని సమాచారం. తెలుగులో ఫస్ట్ టైమ్ గిరిజన యువతిగా డీగ్లామరస్‌ లుక్‌లో కనిపించబోతున్న భామ.. 20 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొననుందని సమాచారం. తెలుగులో చివరగా ‘అల వైకుంఠపురంలో’ కనిపించిన పూజ.. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతున్న ‘రాధే శ్యామ్’ టీజర్ డబ్బింగ్ వర్క్ పూర్తి చేసింది.

Advertisement

Next Story