‘రాధే శ్యామ్’ నుంచి రెండు సర్‌ప్రైజ్‌లు!

by  |
‘రాధే శ్యామ్’ నుంచి రెండు సర్‌ప్రైజ్‌లు!
X

దిశ, వెబ్‌డెస్క్: బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న భామ.. బాలీవుడ్‌లోనూ హవా కొనసాగిస్తోంది. ‘హౌస్ ఫుల్ 4’తో అక్కడ కూడా హిట్ అందుకుని తర్వాతి సినిమాలో సల్మాన్ ఖాన్‌‌తో రొమాన్స్ చేసే చాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో చక్కగా ఇంట్లోనే ఎంజాయ్ చేసిన భామ.. ప్రస్తుతం వరుస పెట్టి టాలీవుడ్ సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటోంది. ఈ మధ్యే అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన భామ.. త్వరలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్‌లో పాల్గొనబోతుంది.

https://twitter.com/hegdepooja/status/1309053975296184321?s=19

సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచే ‘రాధే శ్యామ్’ లాంగ్ షెడ్యూల్ స్టార్ట్ కాగా, ఇప్పుడు పూజ యూనిట్‌తో జాయిన్ కాబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భామ.. మీ అందరితో వర్క్ చేసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని.. ఈ షెడ్యూల్‌లోనే సెట్‌లో రెండు పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లు చెప్పింది పూజ. ఈ రెండింటిలో ఒకటి పూజ (13 అక్టోబర్) బర్త్‌డే కాగా.. మరొకటి హీరో ప్రభాస్ (23 అక్టోబర్) పుట్టినరోజు. అంటే అక్టోబర్‌లో ‘రాధే శ్యామ్’ నుంచి అభిమానులకు రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.


Next Story

Most Viewed