అల్లు అర్జున్‌కు కరోనా.. ‘అల వైకుంఠపురములో’ ట్విస్ట్

by Shyam |
అల్లు అర్జున్‌కు కరోనా.. ‘అల వైకుంఠపురములో’ ట్విస్ట్
X

దిశ, సినిమా : బుట్టబొమ్మ పూజా హెగ్డేకు రెండు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ అని ప్రకటించింది. ప్రస్తుతం తను హోమ్ క్వారంటైన్‌లో ఉంది. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తనకు కూడా కొవిడ్ పాజిటివ్ అని పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన పూజ.. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ స్టైల్‌లో రికవరీ విషెస్ సెండ్ చేసింది. ఇద్దరికీ ఒకేసారి కరోనా రావడం.. బంటూ అమూల్యకు కంపెనీ ఇచ్చినట్లు ఉందని ట్వీట్ చేసింది. బన్నీ కోసం హీలింగ్ లైట్ అండ్ ఎనర్జీ పంపుతున్నానన్న పూజ.. తానెప్పుడైనా ఆరోగ్యంగానే ఉంటాడని చెప్పింది. ఇక రకుల్ ప్రీత్, వరుణ్ తేజ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు బన్నీ స్పీడ్‌గా రికవరీ కావాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story