బుట్టబొమ్మకు సర్‌ప్రైజ్.. ఏం జరిగిందో తెలుసా..?

by Jakkula Samataha |
బుట్టబొమ్మకు సర్‌ప్రైజ్.. ఏం జరిగిందో తెలుసా..?
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ పూజా హెగ్డే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ ‘అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రతీ మూవీ‌ షూటింగ్ సమయంలో తనకు సంబంధించిన బట్టలు, వస్తువులతో ఎంతటి స్పెషల్ అటాచ్‌మెంట్ ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో తెలిపిన భామ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్స్‌ క్లాత్స్, సైకిల్‌ అంటే చాలా ఇష్టం ఉండేదని చెప్పింది.

ఎప్పుడు వాటి గురించి స్పెషల్ అటెన్షన్ చూపించే తనకు మూవీ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చిందని చెప్పింది. ఈ పాటలో కనిపించే సైకిల్‌ను హైదరాబాద్ నుంచి ముంబైకి పంపించారని, దాన్ని తన ఇంట్లో భద్రపరుచుకున్నానని తెలిపింది. ఇదే ఈ సినిమా తనకు ఇచ్చిన గొప్ప జ్ఞాపకమని తెలిపింది పూజ. ఇక యాక్టర్‌కు ఫ్యాషన్ ఎంత ముఖ్యమన్న ప్రశ్నకు కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుందని, సినిమా కోసం నటులు ధరించే దుస్తులు యూనిఫాం లాంటిదని సమాధానమిచ్చింది.

Advertisement

Next Story