మన్కడింగ్ బదులు ‘రన్ పెనాల్టీ’

దిశ, స్పోర్ట్స్: గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యులు జాస్ బట్లర్‌ను పంజాబ్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ (బౌలర్ బంతి వేయకముందే నాన్-స్ట్రైకర్ క్రీజ్ దాటితో అవుట్ చేయడం) ద్వారా అవుట్ చేయడం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా మన్కడింగ్‌పై ఆన్‌లైన్ ద్వారా అశ్విన్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ చర్చించుకుంటున్నారు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న అశ్విన్.. తాను కోచ్‌ను కలిస్తే మన్కడింగ్‌పై తప్పకుండా చర్చిస్తానని చెప్పాడు. తాజాగా ఇద్దరు కలసి ఒక యూట్యూబ్ వీడియో చేశారు.

ఇందులో ఇకపై మన్కడింగ్ చేయకుండా.. నాన్-స్ట్రైకర్ ముందుగానే క్రీజ్ వదిలితే ఒక రన్ పెనాల్టీ విధించాలని ప్రతిపాదించాడు. దీనికి పాంటింగ్ స్పందిస్తూ .. ‘పెనాల్టీ రన్’ అనేది ఒక చక్కని పరిష్కారమే. తన వల్ల జట్టు ఒక పరుగుతు కోల్పోతుందని బ్యాట్స్‌మాన్ భావిస్తే అతను క్రీజ్ వదలి వెళ్లకుండా జాగ్రత్త పడతాడు అని అన్నాడు. ఒక పరుగు కూడా కీలకంగా మారే అవకాశం ఉన్నప్పుడు ఎవరూ ఆ పరుగును వదులుకోరు అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. గత ఏడాది జాస్ బట్లర్ విషయంలో జరిగిన మన్కడింగ్ వంటి సంఘటన పునరావృతం కావొద్దనే భావిస్తున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ పాంటింగ్ అన్నాడు.

Advertisement