‘పొన్నియిన్ సెల్వన్‌’లో ఐశ్వర్య రాయ్ డ్యూయల్ రోల్?

by  |   ( Updated:2021-02-22 06:22:34.0  )
aishwarya roy
X

దిశ, సినిమా : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణలో పాల్గొంటోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ కీలక పాత్రల్లో కనిపించబోతుండగా.. ఐశ్వర్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుందని సమాచారం. పాండియా రాజ్య యువరాణి పాత్రలో మెరిసిపోనున్న ఐశ్వర్య.. అదే సమయంలో ఉన్నత శక్తులతో కూడిన మూగ వృద్ధురాలి పాత్రతో మెస్మరైజ్ చేయనుందని తెలుస్తోంది.

డిఫరెంట్ షేడ్స్‌తో ఉన్న పాత్రల్లో ఐశ్వర్య జీవించిన తీరుకు ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ యూనిట్ ఆశ్చర్యపోయిందట. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో జయం రవి, త్రిష, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

Advertisement

Next Story