కేసీఆర్ శేషజీవితం చర్లపల్లి జైల్లోనే: పొన్నాల

by Shyam |
కేసీఆర్ శేషజీవితం చర్లపల్లి జైల్లోనే: పొన్నాల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు పెడుతూ అవినీతికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. కేసీఆర్ తీసుకునే 90శాతం నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల గురిచేసే విధంగా ఉన్నాయని, కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని ప్రజల్లో ఎండగడుతామన్నారు. సీఎం కేసీఆర్, బీజేపీ ఆడే నాటకాలతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని, ఇక సీఎం కేసీఆర్ శేషజీవితం చర్లపల్లి జైలులోనే అని పొన్నాల మండిపడ్డారు.


👉 Read Disha Special stories


Next Story