- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ నాయకులకు పోలీస్ అధికారుల సంఘం హితవు
దిశ, వెబ్‌డెస్క్ : రాజకీయాల కోసం పోలీసు వ్యవస్థను దిగజార్చి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి హితవు పలికారు. ఆదివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని గౌరవించని వారితో పోరాడడంతోపాటు కరోనాలాంటి విపత్తులతో యుద్ధం చేస్తూ తమ ప్రాణాలను అర్పిస్తున్నామని గుర్తు చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలతో తాము తీవ్రంగా కలత చెందుతున్నామని, మాకూ కుటుంబాలు, మనోభావాలు ఉన్నాయని గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. జగ్గారెడ్డి పోలీసుల మెడలు కోస్తామని, సంజయ్ పోలీసులకు భయం అంటే ఏమిటో చూపిస్తామని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అధికారాన్ని అనుభవించినవారు, చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు, చట్టాలు నిర్మించేవాళ్లు చట్టవ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
క్షణికమైన ఫలితాల కోసమో, తక్షణ స్పందన కోసమో పోలీసు వ్యవస్థను వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని, ఏ అధికారైన చట్టపరిధిని అతిక్రమిస్తే ఫిర్యాదు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయన్నారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చవద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు ఆ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బి.రామచందర్ గౌడ్, కార్యదర్శి గునగంటి వెంకన్న, అసోసియేషన్ సభ్యులు కె.అంజన్ రెడ్డి, పి.రమేష్ ఉన్నారు