ప్రణబ్​ మృతికి పలువురి సంతాపం

దిశ, ఏపీ బ్యూరో: మాజీ రాష్ర్టపతి ప్రణబ్​ ముఖర్జీ మృతికి పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్​ సేవలు జాతి మరువలేదని కొనియాడారు. దాదాజీ జీవితాన్ని నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

సంతాపం వ్యక్తం చేసిన వారిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ నేత నారా లోకేష్​, టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, పి.మధు, బీజేపీ నేతల విష్ణువర్థన్​రెడ్డి ఉన్నారు.

Advertisement