రాజకీయాల్లో కూడా ఎమోషన్స్ ఉంటయ్.. సినీ నటుడు పృథ్వీపై YCP ఎమ్మెల్యే ఫైర్

by Gantepaka Srikanth |
రాజకీయాల్లో కూడా ఎమోషన్స్ ఉంటయ్.. సినీ నటుడు పృథ్వీపై YCP ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: లైలా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌(Laila Movie Pre Release Function)లో నటుడు పృథ్వీ(Actor Prithvi) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజాగా.. ఈ అంశంపై ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్(Chandra Sekhar Tatiparthi) స్పందించారు. సోమవార ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ వేడుకల్లో హుందాతనం పాటించాలని సూచించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై, వైసీపీ(YCP)పై సినీ వేడుకల్లో రాజకీయంగా విమర్శలు చేయడ కరెక్ట్ కాదని అన్నారు. ఎమోషన్స్ సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఉంటాయని ఉంటాయని అన్నారు. ఇప్పుడున్న 11 గొర్రలే.. రేపు గర్జించే సింహాలు అవుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, లైలా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో 150 మేకలు, 11 మేకలు అంటూ కామెంట్లు చేశారు. అయితే వైసీపీని ఉద్దేశించే పృథ్వీ ఈ పొలిటికల్ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఫంక్షన్‌లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని.. చూస్తూ ఊరుకుంటుంటే.. ప్రతీ ఫంక్షన్‌లో ఇలాగే విమర్శలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అంతేకాదు.. కొందరు వైసీపీ ఫ్యాన్స్ ఏకంగా లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. #BoycottLaila అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో లైలా సినిమా మేకర్స్ తలనొప్పిగా మారింది. దెబ్బకి హీరో విశ్వక్ సేన్(Vishwaksen) ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఎవరో ఒకరు చేసినపని సినిమాని నెగిటివ్‌గా ట్రోల్ చేయడం సరికాదని అన్నాడు. క్షమించండి.. మా సినిమాను చంపేయకండి అని విశ్వక్‌సేన్ ఇప్పటికే రిక్వెస్ట్ చేశారు.

Next Story

Most Viewed