ఏ నైతిక హక్కుతో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నిర్వహిస్తారు: మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

by Kalyani |
ఏ నైతిక హక్కుతో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నిర్వహిస్తారు: మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
X

దిశ, గద్వాల: జూన్ 2 వ తేదీన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను బీఆర్ఎస్ నేతలు ఏ నైతిక హక్కుతో నిర్వహిస్తారని ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి 9 ఏళ్లుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టు కానీ, అభివృద్ధి పనులు గాని జరగలేదన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం, చేనేత పార్కు దళితులకు మూడెకరాల భూమి, రేషన్ కార్డులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర పాలకులకు ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి నైతిక చిత్తశుద్ధి ఉంటే ముందుగా సోనియాగాంధీని గౌరవించాలని పేర్కొన్నారు. మహనీయులుగా, ఓ గొప్ప నేతగా, ప్రజాస్వామ్య బద్దులుగా జూన్ 2 న సోనియా గాంధీ చిత్రపటాలకు జిల్లాలోని అన్ని గ్రామాలలో పాలాభిషేకం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు నారాయణరెడ్డి, రాజీవ్ రెడ్డి, వీరబాబు, గట్టు గౌస్, షేక్షావల్లి ఆచారి, సర్పంచ్ రవి, వెంకటరమణ, మద్దిలేటి, రుక్మత్ రెడ్డి, షేక్ జమాల్, అలెగ్జాండర్, మహబూబ్ పాషా, మొయినుద్దీన్, విజయ్, నందు, అక్బర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed