మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలో లేదు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

by Javid Pasha |
మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలో లేదు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రస్తావన రాజ్యాంగంలో లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాకటలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం ఎత్తేయడాన్ని ఆయన సమర్థించారు. కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం ముస్లిం రిజర్వేషన్లు కల్పించిందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవు కాబట్టే తొలగించామని స్పష్టంచేశారు. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ తోలగిన్నారనే వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్ తొలగించమని నొక్కి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ గెలిపించాలని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed