రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు.. టీఆర్ఎస్ నేతలకు కోమటిరెడ్డి హెచ్చరిక

by GSrikanth |   ( Updated:2022-10-09 10:07:00.0  )
రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు.. టీఆర్ఎస్ నేతలకు కోమటిరెడ్డి హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు దక్కిందని, దానికోసమే ఆయన బీజేపీలో చేరారని, ఇది క్విడ్ ప్రోకో అంటూ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక, ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేశారు. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కేటీఆర్‌కు బహిరంగ సవాల్ చేశారు. 24 గంటల సమయం ఇస్తున్నాని.. తనపై చేసిన క్విడ్ ప్రోకో ఆరోపణలు నిజమని నిరూపించాలని లేకపోతే పరువునష్టం దావా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, రాజకీయ విమర్శల పర్వం ఊపందుకుంది. మునుగోడు ప్రచారంలో పోటాపోటీగా పార్టీలు తమదైన వ్యూహాలను రచిస్తున్నాయని. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story