పంజాబ్​, గోవా ఎన్నికలకు స్కామ్​ డబ్బులే.. టీపీసీసీ ఈసీ మెంబర్​ ఈరవత్రి అనిల్

by Javid Pasha |
పంజాబ్​, గోవా ఎన్నికలకు స్కామ్​ డబ్బులే.. టీపీసీసీ ఈసీ మెంబర్​ ఈరవత్రి అనిల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్, గోవా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన సమయంలో ఆప్ పార్టీకి ఏ విధంగా డబ్బులు సమకూరాయనే విషయంపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సెంట్రల్ ఏజెన్సీస్ విచారణ జరిపే క్రమంలోనే కవిత లిక్కర్​స్కామ్​ బయటపడిందని టీపీసీసీ ఈసీ మెంబర్​ ఈరవత్రి అనిల్​ పేర్కొన్నారు. పంజాబ్ లో జరిగిన ఎన్నికలలో కవిత ఇచ్చిన రూ.100 కోట్ల అడ్వాన్స్ ని ఆప్ పార్టీ ఉపయోగించినట్లు ఈడీ ఆరోపిస్తూ విచారిస్తుందని ఆయన తెలిపారు. అయితే సంపూర్ణంగా విచారించి స్కామ్​ రుజువైతే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

దర్యాప్తు సంస్థలు చట్టాన్ని నిర్వీర్వం కాకుండా చేస్తారని కాంగ్రెస్​పార్టీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత ఎవరెవరితో ఎక్కడెక్కడ మీటింగ్​లు పెట్టిందనే వివరాలను రాబట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీంతో పాటు ఇటీవల రాష్ట్రంలో జరిగిన హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల డబ్బును పంచిపెట్టిందని, వాటిపై కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. అది ఎక్కడి నుండి సమకూర్చారు? అనే విషయంపై బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్​కు ఏటీఎంల మారిందని స్వయంగా అమిత్​ షా చెప్పాడని, అంతేగాక విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగాకిషన్ రెడ్డి ప్రకటించినా..కేసీఆర్​ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​లు రెండూ ఒకటేనని, బీజేపీని మళ్లీ గెలిపించడానికే దేశంలోని మైనారిటీ ఓట్లను కేసీఆర్​ చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Advertisement

Next Story

Most Viewed