రాష్ట్రంలో కరెంట్ కోతలు.. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం

by Javid Pasha |
రాష్ట్రంలో కరెంట్ కోతలు.. టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరెంట్ కోతలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. రాష్ట్రంలో విపరీతంగా కరెంటు కోతలు జరుగుతున్నాయని, కానీ మన ముఖ్యమంత్రి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని గోప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా రాష్ట్రంలో త్రీఫేజ్ కరెంట్ నిరంతర సరఫరా లేదన్నారు. ఆ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెల్వదని ఆరోపించారు.

దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. కరెంటును ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కొవడం జరుగుతుందని, కానీ డిస్కంలు ఈ కరెంటు‌ను కొని సప్లాయ్ చేసే పరిస్థితి లేదని వివరించారు. ఎందుకంటే ప్రభుత్వం డిస్కంలకు బిల్లులు కట్టడం లేదని, 50 వేల కోట్ల రూపాయలు డిస్కంలకు కట్టాలన్నారు. ఇదివరకు డిస్కంలకు అస్తులను ప్రభుత్వ తాకట్టు పెట్టి బిల్లులు కట్టేదని ఆరోపించారు.

గతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసేటప్పుడే ప్రభుత్వాన్ని హెచ్చరించామని గుర్తు చేశారు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్కు కరెంటు తీసుకున్నందకు అప్పు కట్టాలన్నారు. ఇప్పుడు వారు కరెంటు ఇవ్వడం లేదని, పైగా ప్రభుత్వం పై కేసు కూడా వేశారని తెలిపారు. ప్రభుత్వం దగ్గర పైసలు లేవని, తీవ్రమైన తప్పిదం కారణంగా ప్రభుత్వం అప్పుల పాలైందన్నారు. రైతులు ఆందోళన తీవ్రతరం అయ్యేలోపే ప్రభుత్వం డిస్కంలకు అప్పులు కట్టాలని, ఈ విషయంపై చర్చలు జరగాలని పిలుపునిచ్చారు.


Advertisement

Next Story