Viral Video: ప్రభాస్ పాటకు స్టెప్పులేసిన వైసీపీ మంత్రి.. అంతటితో ఆగకుండా..?

by Indraja |   ( Updated:2024-04-17 09:17:31.0  )
Viral Video: ప్రభాస్ పాటకు స్టెప్పులేసిన వైసీపీ మంత్రి.. అంతటితో ఆగకుండా..?
X

దిశ వెబ్ డెస్క్: మంత్రి సీదిరి అప్పలరాజు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా వైసీపీ అభ్యర్థిగా గెలిచిన అప్పలరాజు, రానున్న ఎన్నికల్లో కూడా విజయభేరిని మోగించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారకార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజాగా పలాసలో పర్యటించిన ఆయన తాను ఓ మంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి డాన్స్‌లు వేస్తూ ప్రజలను అలరించారు.

మొదటగా ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని బలి బలి బలిరా బలి అనే పాటకు మహిళలతో కలిసి డాన్స్ చేశారు. అనంతరం చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు అంటూ జగన్ పై పాటపాడారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



Next Story