- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడిన పట్టాభి మిస్సింగ్ మిస్టరీ
దిశ, డైనమిక్ బ్యూరో : ఎట్టకేలకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. భారీ పోలీస్ బందోస్తు నడుమ 'పట్టాభి'ని పోలీసులు గన్నవరం కోర్టుకు తరలించారు. పట్టాభితోపాటు మరో 14 మంది టీడీపీ నేతలను సైతం పోలీసులు వ్యాన్‌లో తీసుకువచ్చారు. ప్రతీ టీడీపీ నేత పక్కనే పోలీసులు కూర్చు్న్నారు. కనీసం బస్సు కిటికీలను కూడా ఓపెన్ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గన్నవరం కోర్టు దగ్గర అప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. దీంతో వాహనం నుంచి దింపి వీరందరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇకపోతే సోమవారం గన్నవరం టీడీపీ కార్యాలయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడిచేసి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఇదే సందర్భంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పట్టాభి వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ అభియోగంతో పట్టాభిని అరెస్ట్ చేశారు. అనంతరం పట్టాభిని ఎక్కడకు తరలించారో అనేది బహిర్గతం చేయలేదు. దీంతో భార్య చందన తల్లిడిల్లిపోయింది. తన భర్త ఆచూకీ తెలపాలని వేడుకుంది. మరవైపు ప్రతిపక్ష టీడీపీతోపాటు ఇతర పార్టీలు సైతం పట్టాభి అరెస్ట్‌ను ఖండించిన సంగతి తెలిసిందే.