- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, గువ్వల.. పిచ్చాస్పత్రిలో చెక్ చేయించుకోండి.. ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ కు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఏమైనా మానసిక సమస్యలుంటే పిచ్చాస్పత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలని, మానసిక సమస్యలుంటే చికిత్స చేయించుకోవడంలో తప్పలేదని, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఫైరయ్యారు. ఆయనకు మతి భ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని చురకలంటించారు.
త్వరలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం గల్లంతవడం ఖాయమన్న ఆందోళనతోనే కేసీఆర్ తన తాబేదార్లను ఉసిగొల్పి బండి సంజయ్ ను తిట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతుంటే వాటికి సమాధానం చెప్పే దమ్ము లేక కేసీఆర్ శిఖండి వేషాలు వేస్తున్నాడని మండిపడ్డారు. కొండగట్టు అభివృద్ధి సీఎం కేసీఆర్ బంధువుల కోసమేనన్న బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు నూటికి నూరు పాళ్లు నిజమని, యాదాద్రి అభివృద్ధి మాటున జరిగిన రియల్ దందాను రాష్ట్రమంతా చూసిందని ఆయన గుర్తుచేశారు.
ఇది నిజం కాకపోతే నయీం డైరీని ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర సచివాలయం తెలంగాణకు ప్రతీకగా ఉండాలే కానీ ఓట్ల కోసం గుమ్మటాలు నిర్మించడంపై బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ కేతనం ఎగిరేలా మార్పులు చేస్తామన్నారు.