వదిన ఇచ్చిన రూ. లక్షలపెన్నును కాదని.. రూ.10 పెన్నుతో సంతకం చేసిన డిప్యూటీ సీఎం పవన్

by Indraja |
వదిన ఇచ్చిన రూ. లక్షలపెన్నును కాదని..  రూ.10 పెన్నుతో సంతకం చేసిన డిప్యూటీ సీఎం పవన్
X

దిశ వెబ్ డెస్క్: మెగస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమకు పరిచయమై, అనతికాలంలోనే పవర్‌స్టార్ ఎదిగారు పవన్ కళ్యాణ్. అయితే మెదటి నుండి తాను సంపాధించిన దానిలో సగం కుటుంబానికి ఖర్చు చేస్తే, మిగతా సగం ప్రజాసేవకే ఖర్చు చేసేవారు. కాగా ప్రజలకు మరిన్ని సేవలు అంధించాలంటే అధికారంలో ఉంటేనే సాధ్యం అని తలచిన పవన్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజయం పాలైంది.

అయినా పవన్ వెనకడుగు వేయలేదు. తన పార్టీని ప్రజల్లో బలోపితం చేసుకుంటూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ పానలో రాష్ట్రం అస్థవ్యస్థంగా మారిందని తలిచిన పవన్, రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రాజధాని సైతం లేని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం అండాదండా అవసరం అని తలచిన పవన్ టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీని ఒప్పించారు.

అలా మూడు పార్టీలతో కూటమి ఏర్పండింది. కాగా 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాగా నేడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేసథ్యంలో ఆయన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అయితే ఏ ఫైల్‌పై తొలి సంతకం చేశారు అనే దానిపై స్పష్టత రాలేదు. కాగా ఆయన నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, అలానే పలు శాఖల మంత్రిగా బాధ్యతలను చేపట్టేకంటే ముందుగా క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజ అనంతరం ఆయన తన సీట్లో కూర్చున్నారు. అలానే అనుకున్న సమయానికే సంతకం చేయాలని భావించిన పవన్ టైం చూసురుని అనుకున్న ముహుర్తానికే తొలి సంతకం చేశారు. అయితే ఆయన ఏ ఫైల్‌పై తొలిసతకం చేశారో తెలియలేదు. అయితే ఆయన సంతకం చేసే ముందు ఆ ఫైల్ గురించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలానే తాను సంతకం చేసిన ఫైల్ గురించి తన పర్శనల్ డైరీలో సైతం నమోదు చేసుకున్నారు.

కాగా ఆయనకు తన వదిన సురేఖ 3 లక్షలు విలువ చేసే పెన్నును బహుకరించారించారు. ఈ విషయం పవన్ అన్న చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే ఆ పెన్నును సురేఖ పవన్‌కు బహుకరిస్తూ అధికారికంగా తీసుకునే నిర్ణయాలపై ఆ పెన్నుతోనే సంతకం చేయాలని ఆమె కోరినట్టు సమాచారం. అయితే పవన్ మాత్రం కేవలం రూ.10 పెన్నుతో సంతకం చేసి తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. కాగా నేడు పవన్ ఐఏస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు.

Also Read: పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎంగా చూడటంతో నా జన్మధన్యమైంది: పిఠాపురం వర్మ

Advertisement

Next Story