- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

దిశ, ఉత్తరాంధ్ర: ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖలో వైసీసీ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను చంద్రబాబు ఘోరంగా అవమానించారని అన్నారు. ఈ క్రమంలోనే తన కంటే చంద్రబాబు పెద్ద నటుడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని ఎద్దేవా చేశారు. మ్యాని ఫేస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదన్నారు.
ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు ఎలా మహానాడులో శతజయంతి వేడుకలు చేస్తారని ప్రశ్నించారు. మహానాడులో ఎన్టీ ఆర్ కు క్షమాపణ కోరుతూ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. మహానాడులో నిరుద్యోగులు ..డ్వాక్రా మహిళలకు క్షమాపణ కోరుతూ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి రైతులకు క్షమాపణ కోరుతూ మహానాడులో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఎన్ని కుట్రలు.. దొంగ తీర్మానాలు పెట్టినా జనం టీడీపీని నమ్మేపరిస్థితి లేదన్నారు.