- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్, బీజేపీ చీఫ్‌లు ఉండాల్సింది పిచ్చాస్పత్రుల్లోనే.. రేగా కాంతారావు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉండాల్సింది పిచ్చాస్పత్రుల్లోనేనని, వారిని చేర్పించేందుకు ఆ పార్టీ నాయకులే చొరవ చూపాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎద్దేవా చేశారు. గురువారం బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ మఖ్యమంత్రి కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం ఏ మంచి పని చేసినా వారు అడ్డం పడుతున్నారని అన్నారు. వార్తల్లో ఉండటానికి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, ఒకరు కూలుస్తా, మరొకరు పేలుస్తా అంటున్నారని ద్వజమెత్తారు. కొండగట్టు అభివృద్ధి సీఎం కేసీఆర్ బంధువుల కోసమని బండి అంటున్నారని, ఇంతకన్నా అబద్ధం మరొకటి ఉంటుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష పార్టీల నేతలు ఇకనైనా హుందాగా వ్యవహరించాలని సూచించారు. సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు దేశమంతా ఘనంగా జరగబోతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి తిట్లలో పోటీ పడుతున్నారని అన్నారు. ఈ తిట్లతో రాష్ట్రంలో అధికారం రాదని, వారికి తిట్లు తప్ప ఎజెండా లేదని విమర్శించారు. తన కులాన్ని రేవంత్ రెడ్డి కించపరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 'నేను తలుచుకుంటే రేవంత్ నా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టేవాడా' అని ధ్వజమెత్తారు.
Also Read...
బీజేపీకి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీ నారాయణ కార్టూన్ (16-02-2023)