- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సావర్కర్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఫైర్.. రాహుల్ గాంధీని శిక్షించాలంటూ డిమాండ్
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటిపేరు విషయంలో రెండేళ్ల శిక్షతో పాటు ఎంపీ పదవిని కూడా పోగొట్టుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మళ్లీ చిక్కుల్లో పడ్డారు. సావర్కర్ పై తను చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ నాయకులు ఖండించగా.. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆ వరుసలో చేరారు. సావర్కర్ మహారాష్ట్ర ప్రజలకు ఆరాధ్యదైవమే కాక యావత్ దేశానికే ఆదర్శమని, అలాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.
‘‘క్షమాపణలు చెప్పడానికి నా పేరు సావర్కర్ కాదు.. గాంధీ’’ అంటూ రాహల్ వ్యాఖ్యానించారని షిండే గుర్తు చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్స్ కి ఆయనపై ఎలాంటి విమర్శలు చేసినా తక్కువేనన్నారు. సావర్కర్ గురించి రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సావర్కర్ ను అవమానించేలా మాట్లాడిన రాహల్ గాంధీని శిక్షించాలని ఏక్ నాథ్ షిండే డిమాండ్ చేశారు.
Next Story