బీజేపీ, జేడీఎస్ మధ్య కుదిరిన పొత్తు.. నడ్డా రియాక్షన్ ఇదే!

by GSrikanth |
బీజేపీ, జేడీఎస్ మధ్య కుదిరిన పొత్తు.. నడ్డా రియాక్షన్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ పార్టీకి కర్నాటకలో జేడీఎస్‌తో పొత్తు కుదిరింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జేడీఎస్ నేత, కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పొత్తు అంశాన్ని కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. ‘ఈరోజు ఎన్డీయే కూటమిలో చేరే విషయంలో బీజేపీతో అధికారికంగా ప్రాథమిక చర్చలు జరిపాము. కూటమిలో చేరే విషయంలో తమకు ఎటువంటి డిమాండ్లు లేవు’ అన్నారు.

ఎన్డీయే కూటమిలోకి జేడీఎస్ చేరడంపై జేపీ నడ్డా సంతోషం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమిలో చేరాలనుకున్న జేడీఎస్‌కు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఈ నిర్ణయం ఎన్డీయే కూటమిని, ప్రధాని మోడీ విజన్‌ను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ దిశగా సీట్ల పంపకాలపై కూడా ఇరు పార్టీల మధ్య ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఈ రెండు పార్టీల కలయికతో సౌత్ ఇండియాలో బీజేపీకి ఏ మేరకు కలిసి రానుంది అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.



Advertisement

Next Story

Most Viewed