కవితకు తెలంగాణ మద్దతు ఉంటే ఎందుకు ఓడిపోయింది?.. కేఏ పాల్

by Javid Pasha |
కవితకు తెలంగాణ మద్దతు ఉంటే ఎందుకు ఓడిపోయింది?.. కేఏ పాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కవిత, కేటీఆర్ ప్రెస్ మీట్ లో భయం కనిపిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మీడియా సంస్థలను బ్యాన్ చేస్తానని కేటీఆర్ చెబుతున్నాడని ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు. మీరు మీడియాను భయపెట్టడమే కాకుండా ఆ నిందను ఇతరులపై వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. తనను దర్యాప్తు సంస్థ వచ్చి తన ఇంట్లో విచారించమని కవిత అంటోందని కానీ సోనియా గాంధీని ఈడీ ఎక్కడ విచారించిందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లుగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పేద రాష్ట్రంగా మార్చారని, కేసీఆర్ కేబినెట్ లో మహిళలకు స్థానం ఇవ్వకుండా ఇప్పుడు మహిళా సమస్యలపై ఏడ్పు దేనికని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల మద్దతు తనతో ఉందని కవిత చెబుతోందని అలాంటప్పుడు తాను ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. న్యాయం కవిత పక్షం లేదని ఆమెకు దైవ మద్దతు కూడా లేదన్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ తప్ప కవిత వెంట ఎవరూ లేరన్నారు. ఇకనైనా తన తప్పులను తెలుసుకుని కవిత వ్యవహరించాలన్నారు. అన్ని సర్వేల్లో కేసీఆర్ పరిపాలనను వ్యతిరేకిస్తున్నారన్ని అదే సమయంలో ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారన్నారు. దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉంటే కేవలం కవిత దీక్షకు 18 పార్టీలు మాత్రమే మద్దతు తెలిపారన్నారు. కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంలో ఏం జరిగిందో తెలియాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed