- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్కడినుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం పక్కా.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు, లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలుస్తామని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పారు. కాపులకు ఇదే మంచి అవకాశం అని సూచించారు. మరోసారి తిరుపతి నుంచి మెగాస్టా్ర్ చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి పోటీకి దిగితే 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. రాజకీయాల్లో రీఎంట్రీపై, వచ్చే ఎన్నికల్లో పోటీ వెంటనే చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఏపీపై అధికారం చేజిక్కించుకోవడం సులభం అవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. కాకినాడ లోక్‌సభ నుంచి సీపీఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ నారాయణ పోటీ చేయాలని కోరారు.