- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొలిటికల్ గ్రౌండ్‌లోకి క్రికెటర్ అంబటి.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ?
దిశ, డైనమిక్ బ్యూరో : అంబటి రాయుడు క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి భారత జట్టులో స్థానం సంపాదించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు అంబటి రాయుడు. మైదానంలో పరుగుల వరద సృష్టించిన అంబటి రాయుడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ కోసం అంబటి రాయుడు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అటు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు ఏపీలో వైసీపీలో చేరి గుంటూరు లోక్ సభ లేదా పొన్నూరు అసెంబ్లీకి పోటీ చేస్తారంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. అంబటి రాయుడు ఇంతకీ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారంటూ అభిమానులు గందరగోళానికి గురయ్యారు. అయితే ఓ ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి రాయుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌పై కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు తన దృష్టిని రాజకీయాల వైపు మళ్లించేలా చేశాయని చెప్పుకొచ్చారు. అయితే తాను ప్రస్తుతం తన సొంత జిల్లాపైనే ఫోకస్ పెట్టినట్లు అంబటి రాయుడు వెల్లడించారు. తన సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్స్ అని చెప్పక చెప్పిన అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై మాత్రం సమాధానం ఇవ్వలేదు. అయితే వైఎస్ జగన్‌పై ప్రసంశలు కురిపించడంతో వైసీపీలో చేరతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో సీఎం వైఎస్ జగన్‌తో అంబటి రాయుడు భేటీ కావడం అందుకు నిదర్శనమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మరోవైపు వైసీపీలో చేరిక ఇక లాంఛనమేనని వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ లేదా పొన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్సే
రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు క్రికెటర్ అంబటి రాయుడు రెఢీ అవుతున్నారు. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు తన సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్స్ అని హింట్ ఇచ్చేశారు. రాజకీయాల్లో తనను రెండు అంశాలు ఇన్‌స్పైర్ చేసినట్లు అంబటి రాయుడు వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం సిద్ధిపేటలో తాను ల్యాండ్ కొనుగోలు చేశానని.. అప్పుడు అక్కడ రెండు తడులకు నీరు వచ్చేది కాదు. కానీ.. ఇప్పుడు నీరు పుష్కలంగా ఉంది. దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వంపైనా ప్రసంశలు కురిపించారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో రిచ్, పూర్‌ను డివైడ్ చేస్తూ అనేక సంక్షేమ పథకాలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పేదల కష్టం ఏంటో తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఏపీలో పేదల కోసం జగన్ ఎంతో చేస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల చదువుకోసం అనేక పథకాలు రూపొందిస్తున్నారని...పేద ప్రజలు రిచ్ అయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ అంశాలే తనకు రాజకీయాలపట్ల ఆసక్తి చూపించాయని చెప్పుకొచ్చారు.
వైసీపీతోనే రాజకీయ ఆరంగేట్రం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల క్రికెటర్ అంబటి రాయుడు తన అభిమానాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. సీఎం వైఎస్ జగన్ ట్విటర్‌ను ఫాలో కావడం...సీఎం ట్వీట్స్‌ను రీ ట్వీట్స్ చేయడం...ప్రసంసలతో ముంచెత్తడం చేస్తూ ఉండేవాడు. దీంతో ఇక అంబటి రాయుడు వైసీపీలో చేరడం దాదాపు ఖాయంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై రాయుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఓ ప్రముఖ ఛానల్‌లో రాజకీయాలపై తనకు ఆసక్తి ఉందని తేల్చి చెప్పేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు తాను సిద్దంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు యూత్ పట్ల ఎంతో శ్రద్ధ ఉంది అని.. యువతను అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు యువత గురించి తమ మధ్య చర్చ జరిగిందని తెలిపారు. యూత్‌కు క్రికెట్ అకాడమీ ఏర్పాటు గురించి మాట్లాడినట్లు తెలిపారు. సీఎస్‌కే లాంటి ఫ్రాంచైజీ.. ప్రభుత్వం కలిసి పనిచేస్తే.. యువతకు ఎంతో మంచి జరుగుతుందని ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
గుంటూరుపైనే ఫోకస్
అంబటి రాయుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. దీంతో తన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై తన ఆలోచన అని అంబటి రాయుడు వెల్లడించారు. స్థానిక ప్రజలతో మమేమకం అవుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తున్నానని..ఏది చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో అన్నీ అడిగి తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ‘నేను వచ్చింది కృష్ణా డెల్టా ఏరియా నుంచి. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా డ్రీమ్. సీఎం జగన్ మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ఎంతో అభివృద్ధి జరగబోతోంది. డెల్టాను బంగారం చేయడమే నా లక్ష్యం. అభివృద్ధి రెండు రకాలుగా ఉంటుంది. సోషల్ డెవలప్మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటాయి. ఏదో నాలుగు బిల్డింగ్‌లు కడితే అభివృద్ధి అవుతుందా.. అందరూ ఎదిగేలా ప్లాన్ చేయాలి. బందరు పోర్టు ద్వారా తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది. దానికి సగం డబ్బు తెలంగాణ కూడా ఇవ్వాలి. ఈ పోర్టు ద్వారా ఇంకా ఎన్నో పరిశ్రమలు రానున్నాయి అంటూ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
లోతుగా అధ్యయనం
ఇకపోతే ఇంటర్వ్యూలో అంబటి రాయుడు పాలిటిక్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్‌లోకి వస్తే ఫుల్ టైం ఉండాలి. పార్ట్ టైం కాదు కదా అంటూ అంబటి రాయుడు చెప్పుకొచ్చారు. కొన్నాళ్లు ఏపీలో.. ఇంకొన్నాళ్లు హైదరాబాద్‌లో, మరికొన్నాళ్లు అమెరికాలో ఉండటం కుదరదు కదా అని అన్నారు. ప్రస్తుతం అయితే ప్రజల్లో తిరుగుతున్నా.. మాట్లాడుతున్నా.. వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో యువత ఇంకా రాజకీయాల్లోకి రావాలంటూ తన మనసులో మాట బయటపెట్టారు. యువత సమస్యలు వారికే అర్థం అవుతాయి అని చెప్పుకొచ్చారు. ప్రాంతాల వారీగా అనేక సమస్యలు ఉంటాయి. వాటిని గుర్తించి పరిష్కరించాలి అంటూ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ప్రతీ ప్రాంతం, ప్రతీ గ్రామం అభివృద్ది చెందాలి అన్నదే తన లక్ష్యమన్నారు. అందర్నీ ఒక్కచోటికి వచ్చేలా, అందరూ ఒక్క దగ్గరే ఉండాలనడం, పేదవారు మన ఇంట్లో పని చేయాలనడం పద్దతి కాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ వర్గం ఎదగాలి. ప్రతీ మనిషి డెవలప్ కావాలి అన్నదే తన ధ్యేయం అని అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే ఇక అంబటి రాయుడు త్వరలోనే రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది. క్రికెట్ బ్యాట్‌తో మైదానంలో పరుగుల వరద సృష్టించిన అంబటి రాయుడు మరి పాలిటిక్స్‌లో అదే స్థాయిలో దూసుకు పోతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read more: అతని కొడుకు కోసం నా కెరీర్ నాశనమైనది'.. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్‌పై అంబటి రాయుడు సంచలన ఆరోపణలు
- Tags
- ambati rayudu