- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ మెదడులోనే అవినీతి మూలాలు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
by Javid Pasha |
X
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో జరిగే అవినీతి మూలాలు నరేంద్ర మోడీ మెదడులోనే ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడం వలన ఎల్ఐసీకి రూ. 40 వేల కోట్లు, ఎస్బీఐ రూ. 9 వేల కోట్లు, ఇతర బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ కుంభకోణం పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ఎల్ఐసీ, రిజర్వు బ్యాంకు ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సీపీఐ పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. అదానీ కంపెనీలపై తక్షణ చర్యలకు ఆదేశించి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story