CM Jagan: పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్..

by Indraja |   ( Updated:2024-04-25 06:41:44.0  )
CM Jagan: పులివెందుల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్..
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా పులివెందుల నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మినీ సెక్రటేరియట్‌లో ఉన్న ఆర్వో కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు.

అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పాత్రలను అందించి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఆయన పేరుపై ఓ సెట్ నామినేషన్ దాఖలైంది. కాగా నేడు మరో సెట్ నామినేష్‌‌ను సీఎం జగన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు ఉదయం పులివెందులకు చేరుకున్న సీఎం జగన్ ముందుగా CSI గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ పులివెందులలో వైసీపీ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. అలానే తన సొంత చెల్లెల్లు వైఎస్ షర్మిల, సునీతపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వివేకానంద రెడ్డిని చంపిన హంతకులతో తన చెల్లెల్లు చేతులు కలిపారని మండిపడ్డారు. వైఎస్ అవినాష్ రెడ్డి నిర్దోషి అని తాను బలంగా నమ్మడం కారణంగానే అతనికి టికెట్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

హంతకులతో చేతులు కలిపిన వాళ్ళా..? లేక ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ..? ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులు అని ప్రజలను ప్రశ్నించారు. కాగా తమ చిన్నాన్న వివేకానంద రెడ్డికి రెండో పెళ్లి జరిగిందని, ఆయనకు రెండో భార్యతో పిల్లలు కూడా ఉన్నారని జగన్ తెలిపారు.

Read More : CM జగన్‌కు వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ

Advertisement

Next Story