Breaking News: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. నేరుగా అక్కడికే..

by Indraja |   ( Updated:2024-06-20 07:52:27.0  )
Breaking News: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. నేరుగా అక్కడికే..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. కాగా 2019 తర్వాత అమరావతి పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ భవన నిర్మాణాలు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు రాజధాని అంతటా పర్యటించి పరిశీలించనున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ధ్వంశం చేసిన ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించాలని తలచిన చంద్రబాబు నేరుగా ప్రజావేదికను సందర్సించారు.

నాడు వైసీపీ కూల్చివేసిన ప్రజావేదిక సిథిలాలు సైతం అక్కడే ఉన్నాయి. కాగా నేడు ఆయన సీడ్ యాక్సిస్ రోడ్డు, జడ్జిల క్వార్టర్స్‌తోపాటు ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్స్‌‌ను పరిశీలించనున్నారు. అలానే రాజధాని శంతుస్థాపన ప్రాంతానికి సైతం సీఎం వెళ్లనున్నారు. కాగా ఈ రోజు మధ్యహానం 1 గంటకు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు.

Next Story

Most Viewed