Ganta Srinivasa Rao : గంటాకు బిగ్ షాక్.. టీడీపీ తొలి జాబితాలో దక్కని చోటు

by Nagaya |   ( Updated:2024-02-24 07:18:39.0  )
Ganta Srinivasa Rao : గంటాకు బిగ్ షాక్.. టీడీపీ తొలి జాబితాలో దక్కని చోటు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చోటుదక్కలేదు. గత ఎన్నికలలో విశాఖ పార్లమెంటు పరిధిలో నలుగురు తెలుగుదేశం నుంచి విజయం సాధించారు. అందులో విశాఖ దక్షిణ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వెళ్లారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామక్సష్ణబాబు, విశాఖ పశ్చిమ నుంచి పీవీజీఆర్ నాయుడు( గణబాబు) లు సీట్లు నిలబెట్టుకొన్నారు.

విశాఖ ఉత్తర నుంచి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ ఆమోదం లేకుండా రాజీనామా చేశారు. నాలుగేళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవల యాక్టివ్ అయిన గంటాను చీపురుపల్లి వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించినప్పటికీ ఆయన విముఖత వ్యక్తం చేయడంతో మొదటి జాబితాలో ఆయన పేరే లేకుండా పోయింది. గత రెండు మూడు ఎన్నికలలో పలువురుకి టికెట్లు ఇప్పించిన గంటా ఇప్పుడు స్వయంక్రుతాపరాధాలతో తన టికెట్‌కే గ్యారెంటీ లేని దుస్థితిలో పడిపోయారు.

Read More : జనసేన మొదటి విడత అభ్యర్థులు వీరే

Advertisement

Next Story