రాజకీయ వారసుడిని ప్రకటించిన BSP చీఫ్ మాయావతి

by GSrikanth |
రాజకీయ వారసుడిని ప్రకటించిన BSP చీఫ్ మాయావతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు. యూపీలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కూడా ఆకాష్‌కు అప్పగించారు. ఇవాళ లక్నోలో బీఎస్పీ జాతీయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల మీద కీలక చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికల ముందు అమె తన వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌‌ను ప్రకటిస్తూ సంచలన ప్రకటన చేశారు. ఆకాష్ ఆనంద్ మాయావతి చిన్న తమ్ముడి కుమారుడు. 2016లో పార్టీలో జాయిన్ అయిన ఆనంద్.. 2019లో ఆకాష్‌ను జాతీయ సమన్వయకర్తగా నియమించారు. గత సంవత్సరం నుంచి రాజస్థాన్‌లో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

2018 రాజస్థాన్‌లో బీఎస్పీ గెలుచుకున్న 6 సీట్ల విజయం వెనకాల ఆనంద్‌ పాత్ర ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సమావేశానికి హాజరైన బీఎస్పీ నేత ఉదయవీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి తన వారసుడిగా ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు. ఆకాష్ ఆనంద్ బీఎస్పీ ఉనికిని, పార్టీ బలహీనంగా ఉన్న చోట ఎన్నికల సన్నాహాలను పరిశీలిస్తారన్నారు. బెహెన్ జీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పార్టీకి నాయకత్వం వహిస్తారని, ఆనంద్ జీ ఇతర రాష్ట్రాల్లో పార్టీకి నాయకత్వం వహిస్తారని సింగ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed