‘మోడీ’పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ నేత

by Javid Pasha |   ( Updated:2023-03-25 14:14:04.0  )
‘మోడీ’పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ నేత
X

దిశ, వెబ్ డెస్క్: ‘మోడీ’ అనే పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోడీ ఇంటిపేరు వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటంతో పాటు ఆయన ఎంపీ పదవి కూడా పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాహుల్ గాంధీని పార్లమెంట్ కు రానీయకుండా మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నిందని వారంతా ఆరోపిస్తున్నారు. కాగా తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు.

లలిత్ మోడీ, నరేంద్ర మోడీ, నీరవ్ మోడీ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి ‘జనరల్ నాలెడ్జ్ ప్రశ్న.. దీనిలో కామన్ గా ఉంది ఏంటీ’ అంటూ కామెంట్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘మొదటి వ్యక్తి (లలిత్ మోడీ) కాంగ్రెస్ హయాంలోనే స్కామ్ లకు పాల్పడ్డారు. ఇక రెండో వ్యక్తి (నరేంద్ర మోడీ) తనను కాంగ్రెస్ ఎంత అణచివేయాలని ప్రయత్నించినా విజయవంతమైన నాయకుడిగా ఎదిగారు. ఇక మూడో వ్యక్తి( నీరవ్ మోడీ) కాంగ్రెస్ సహాయంతో భారత బ్యాంకులను లూటీ చేశారు. ఈ మూడింటిలో కామన్ గా ఉంది కాంగ్రెస్’’ అంటూ గట్టి రిప్లై ఇచ్చారు.

Advertisement

Next Story