బండి సంజయ్ అరెస్ట్: రంగంలోకి బీజేపీ హైమాండ్

by Javid Pasha |
బండి సంజయ్ అరెస్ట్:  రంగంలోకి బీజేపీ హైమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: పదో తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీని కలిసి సంజయ్ అరెస్ట్ గురించి వివరించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ కు అండగా ఉండాలని పీఎం మోడీ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం జేపీ నడ్డా, అమిత్ షా మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి రాష్ట్ర నేతలతో ఆరా తీశారు. ఈ క్రమంలోనే అమిత్ షా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి బండి సంజయ్ కు పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం.

అదే విధంగా జేపీ నడ్డా బేజేపీ నేత రామచంద్రరావుకు ఫోన్ చేసి తాజా పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ అరెస్ట్, తదనంతరం పరిణామాల గురించి రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తోంది. ఈ క్రమంలోనే పేరు మోసిన న్యాయనిపుణులను బీజేపీ నాయకత్వం సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Advertisement

Next Story

Most Viewed