- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jayasudha: దూకుడు పెంచిన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీకి మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై ?
దిశ, వెబ్డెస్క్: Actress Jayasudha likely to join BJP| అధికారమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి అనేకమంది చేరుతుండగా.. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికకు సైతం సమయం ఆసన్నమైంది. తాజాగా.. మరో కీలక నేతను పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ నాయకత్వం భావిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జయసుధతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ జయసుధ(Jayasudha)తో చర్చలు జరిపారు. దీంతో, బీజేపీలో చేరేందుకు జయసుధ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 21న బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ ఆహ్వానించారు. అదే రోజు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ పార్టీలో చేర్చుకునేందుకు కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ఆరోజే జయసుధ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాగా నటి జయసుధ గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె జగన్ నేతృత్వంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇది కూడా చదవండి: సిరిసిల్ల రాజకీయాల్లో పదవి లేని ఓ శక్తి.. ఈ' చీటీ'
పాలేరులో ఎన్నికల సందడి.. సై అంటే సై.. అంటున్న తుమ్మల, కందాళ?
- Tags
- Jayasudha