- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఇండియాలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో రాజకీయ సమావేశం'
దిశ, ఏపీ బ్యూరో: ప్రతి ఏటా టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ఘనంగా ఆరంభమైంది. నేటి నుంచి రెండురోజుల పాటు టీడీపీ మహానాడును నిర్వహించనుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దిగ్విజయంగా మహానాడు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆన్ లైన్ మాధ్యమంగా మహానాడు జరగనుంది. దాదాపు 14 వేల మంది కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.
తొలి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో వైఫల్యాలు, రాజధానిగా అమరావతి కొనసాగించాల్సిన అవసరంపై చర్చ వంటి అంశాలతో పాటు, పోలవరం, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులపై నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు, అక్రమ కేసుల బనాయింపులు, రైతు రుణమాఫీ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలూ చర్చకు రానున్నాయి. ఈ ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబునాయుడు దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించి, మహానాడును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి సమస్యలకైనా అందుబాటులో ఉన్న టెక్నాలజీ పరిష్కార మార్గాన్ని చూపిస్తుందన్న తన నమ్మకం మరోసారి బలపడిందని అన్నారు. నేటి నుంచి పార్టీ మహానాడు కార్యక్రమం ప్రారంభించామన్న ఆయన లాక్ డౌన్ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ, డిజిటల్ సోషలైజేషన్ దిశగా సాగుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరం జరుగుతున్న డిజిటల్ మహానాడు కూడా అటువంటిదేనని ఆయన వెల్లడించారు.
ప్రతి సంవత్సరమూ అసంఖ్యాకంగా వచ్చే నేతలు, కార్యకర్తల మధ్య సాగే మహానాడుకు ఈ సంవత్సరం నిబంధనలు అడ్డుగా నిలిచాయని ఆయన చెప్పారు. అయితే జూమ్ యాప్ తమకు కొత్త మార్గాన్ని చూపిందన్నారు. ఇండియాలోనే తొలిసారిగా ఓ రాజకీయ సమావేశం డిజిటల్ మాధ్యమంగా సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీకి చెందిన వారంతా తమ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లలో జూమ్ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం రెండు రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు.