యువతి ఆత్మహత్య.. పోలీస్‌పై సస్పెన్షన్ వేటు

by  |
యువతి ఆత్మహత్య.. పోలీస్‌పై సస్పెన్షన్ వేటు
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు యువతిని. రోజురోజుకూ అతని వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయం అతనికి తెలియడంతో ఆమెను మరింతగా వేధించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆమె గురువారం ఆత్మహత్య చేసుకుంది. ఒడిషాలోని దేన్‌కనాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

బాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతిని 40 ఏళ్ల వ్యక్తి ఆమెను తాకుతూ.. తనతో సన్నిహితంగా ఉండాంటూ లైంగికంగా వేధింస్తున్నాడు. వేధింపులు తీవ్రమవ్వడంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో జులై 6వ తేదీన బాపూర్ ఏఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడంలో ఏఎస్ఐ నిర్లక్ష్యం వహించారు.

ఈ క్రమంలో యువతిపై అతని ఆగడాలు తీవ్రమయ్యాయి. వేధింపులు తాళలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది బాధితురాలు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించారు. కేసు నమోదు చేసి నిందితుడికి శిక్ష విధించకపోవడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనకు కారణమైన బాపూర్ ఏఎస్ఐని సస్పెండ్ చేశారు.


Next Story