- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా దెబ్బకు పోలీస్ స్టేషన్ క్లోజ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై ప్రభావం చూపిందని విన్నాం.. కానీ, వైరస్ ఎఫెక్ట్ ఏకంగా పోలీస్ స్టేషన్ మీద కూడా పడింది. లాక్‌డౌన్‌లో షాపులు మూసినట్టు.. వైరస్ కారణంగా పోలీస్ స్టేషన్‌నే మూసివేశారు. ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం గమనార్హం. వివరాళ్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా వెంకటగిరి పీఎస్‌లో కరోనా కాటు వేసింది. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సైతో పాటు మిగతా 9 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ స్టేషన్‌కు కరోనా భయం పట్టుకుంది. ఈ ఘటనపై అప్రమత్తమైన ఉన్నతాధికారులు పీఎస్ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఓ కేసులో నిందితులు అరెస్ట్ అయిన వారు, స్టేషన్ స్వీపర్ల నుంచి వైరస్ సోకినట్టు సమాచారం. వైరస్ సోకిన పోలీసులందరినీ క్వారంటైన్‌కు తరలించి.. వారి కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్టు ఉన్నవారికి అధికారులు కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.