- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మామిడి కాయ దొంగలను జైలుకు పంపిన పోలీసులు
దిశ, జగిత్యాల: పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు దొంగలు పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు వెంబడించి పట్టుకోగా.. చివరకు మామిడికాయ దొంగలు అని తేలింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామ శివారులోని మొర్రి విజయ్ అనే రైతు తన మామిడి తోటలో గుర్తుతెలియని వ్యక్తులు మామిడి కాయలు దొంగిలించారని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు చల్‌గల్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద రూరల్ పోలీసులు వాహనాల సోదాలు చేపట్టారు. ఇదే సమయంలో ఒక ప్యాసింజర్ ఆటోలో మామిడికాయలతో నలుగురు వ్యక్తులు వస్తూ పోలీసులను చూసి ఇద్దరు పారిపోగా.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరిని విచారించగా మామిడి కాయలను దొంగతనం చేశామని ఒప్పుకోవడంతో వారి నుండి రెండు క్వింటాళ్ల మామిడి కాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు.