- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనాల సీజ్ వ్యవహారంపై స్పందించిన పోలీసులు.. నెటిజన్ల 'లా'జికల్ ప్రశ్న ఇదే
దిశ, వెబ్‌డెస్క్: వాహనాలపై చలాన్లు ఉంటే సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని హైకోర్టు తీర్పునిచ్చినట్లు వచ్చిన వార్తలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. చలాన్లు ఉన్న వాహనాన్ని సీజ్ చేసే అధికారం తమకు చట్టం ఇచ్చిందని తెలియజేస్తూ ఆదివారం పబ్లిక్ నోటీసును విడుదల చేశారు. ప్రకటన ప్రకారం చలాన్లు ఉంటే వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అలాంటి ఆదేశాలు ఎక్కడా రాలేదని, ఇలాంటి వార్తలు నమ్మొద్దని తెలిపారు. అయితే ఆ న్యాయవాది ఎంవీ యాక్ట్-1989 ప్రకారం చలాన్‌ను చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లారని తెలిపారు. చట్టం తెలిపిన ప్రకారం చలాన్ విధించి 90 రోజులు గడుస్తే వాహనం సీజ్ చేయొచ్చని తెలిపారు. అంతేకాకుండా ఎంవీ యాక్ట్‌లోని రూల్ 167 ప్రకారం సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు (సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు) ఉందని ప్రకటనలో తెలిపారు.
సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనపై నెట్టింట చర్చ మొదలైంది. సామాజిక వేత్త విజయ్ గోపాల్ దీనిపై ఘాటుగా స్పందించారు. ఎంవీ యాక్ట్‌లోని 167 రూల్‌లో ఉన్న నిబంధనలు తెలిపే ఫొటోని జోడిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ పోస్ట్ చేశారు. ఆయన పోస్టు చేసిన ఫొటోలో చట్టంలోని 167(8) లో కోర్టు ఆదేశాలతో వాహనాన్ని సీజ్ చేయొచ్చని ఉంది. ఈయన పోస్ట్‌తో నెట్టింట పోలీసులను ప్రశ్నిస్తూ ట్వీట్‌లు చేయడం మొదలు పెట్టారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తారా? అని విమర్శిస్తున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి సైబరాబాద్ పోలీసుల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడం గమనార్హం.